అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వాట్ నెక్ట్స్?

Date:

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం లోక్‌సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్.. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం రెండు గంటల పాటు టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన సహా వివిధ పార్టీల సభ్యులు బిల్లుపై చర్చించారు. ఆ తర్వాత అమరావతి బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బిల్లుకు మద్దతిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. గురువారం రోజున ఈ బిల్లును కేంద్రం రాజ్యసభ ముందుకు తీసుకురానుంది.

మరోవైపు అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. అమరావతి ఆంధ్రుల కలల రాజధానిగా అభివర్ణించారు. అమరావతి కోసం భూములను త్యాగం చేసిన రైతులకు అభినందనలు తెలియజేశారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలన్న పెమ్మసాని చంద్రశేఖర్.. అమరావతి ఉద్యమంలో పోరాడిన మహిళలకు అభినందనలు తెలిపారు. వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం.. మూడు ప్రాంతాల నడుమ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అమరావతి రైతులు, మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయని పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందా? అనే అనుమానానికి ఈ చట్టసవరణతో ముగింపు పలకాలని అన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...