బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా తెలంగాణకు చెందిన సింధురెడ్డి కసిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ హేమాంగ్ జోషి మంగళవారం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 34 మందికి ఈ కార్యవర్గంలో చోటు కల్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *