నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా రికార్డు కలెక్షన్లు సాధించింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా ’ ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే పాటలు, గ్లింప్స్, ట్రైలర్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో రిలీజ్ కు ముందే నాని సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ది ప్యారడైజ్ సినిమా అంచనాలు అందుకోలేకపోయిందని చెప్పవచ్చు. చాలా చోట్ల నాని సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే నాని నటన మాత్రం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శికంజా మాలిక్ అనే కరుడుగట్టిన విలన్ పాత్రలో భయపెట్టాడు.ఇక హీరోయిన్ కయాదు లోహర్ కూడా చాలా అందంగా కనిపించింది. మొత్తానికి ఓవరాల్ గా ది ప్యారడైజ్ సినిమాకు రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ది ప్యారడైజ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే ది ప్యారడైజ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ నాని సినిమా అందుబాటులో ఉంది
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ది ప్యారడైజ్ మూవీని నిర్మించారు. రాఘవ్ జుయేల్, సంపూర్ణేష్, ప్రియదర్శి, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. కాగా ది ప్యారడైజ్ థియేటర్ వెర్షన్ లో తొలగించిన సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో జోడిస్తున్నట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అలాగే ఒక పాటను కూడా యాడ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. మరి ఓటీటీ వెర్షన్ లో ఏమైనా మార్పులు చేశారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ది ప్యారడైజ్ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సమాజంలో ఎలాంటి గుర్తింపు, కనీస పౌరసత్వ హక్కులు లేని ‘సవారీ’ అనే ఒక సంచార తెగకు చెందిన ప్రజల కథ ఇది. ఆ ప్రాంతాన్ని శాసిస్తూ, ఆ ప్రజలను బానిసలుగా చూస్తుంటారు షికంజా మాలిక్ (మోహన్ బాబు), అతని కొడుకు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయల్) . వీరి అణచివేతపై ఆ తెగకు చెందిన సమ్మక్క (సోనాలి కులకర్ణి) అనే మహిళ మొదటిసారి తిరుగుబాటు చేస్తుంది. అలాగే ఆమె కొడుకు జడల్ (నాని) మాలిక్ దారుణాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తాడు. తన జాతి ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం జడల్ చేసిన ఈ రక్త పాత పోరాటమే ‘ది ప్యారడైజ్’ సినిమా.
