విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మాళ మల్లేశ్వర స్వామి జైత్రయాత్ర (బన్ని ఉత్సవం) అంగరంగ వైభవంగా జరిగింది. దేవరగట్టు కొండ పరిసరాల్లో గురువారం తెల్లవారుజాము వరకు సాగిన ఈ వేడుకలో భక్తుల కర్రల సమరంతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది.

దేవరగట్టు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 15 గ్రామాల భక్తులు ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ‘మొగలాయి’ ఆటలో భక్తులు కర్రలతో తలపడుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

అయితే, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఉత్సవంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సంప్రదాయంగా వస్తున్న బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *