ఏపీ ప్రజలపై మరో భారం.. పాలు, పెరుగు ధరలు పెంపు.. కొత్త రేట్లు ఇవే

Date:

ఏపీలో విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెంచారు. విజయ డెయిరీకి సంబంధించి లీటరు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ తెలిపింది. విజయ డెయిరీకి సంబంధించి ఈ ధరలు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అమల్లో ఉంటాయి. ఈ నెల 4 నుంచి అమల్లోకి వస్తాయి. సంగం డెయిరీకి సంబంధించి పెంచిన పాల ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పాలు ధరలు పెరిగాయి.. ఇటీవల రైతులకు పాలసేకరణ ధరలు పెరగడం, వ్యయం పెరగడంతో.. విజయ, సంగం డెయిరీలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మార్కెట్‌లో విజయ లీటరు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ప్రకటించింది. ఈ నెల 4 నుంచి పెరిగిన ధరల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ నెల 9 వరకు నెలవారీ పాల కార్డు కొనుగోలు చేసిన వారికి మాత్రం పాత ధరలు వర్తిస్తాయి. మొత్త ఏడు రకాల పాల ధరలు పెంచారు. అంతేకాదు పెరుగుపై రూ.10 నుంచి రూ.30 వరకు పెరిగింది. 10 కేజీల స్టాండర్డ్ మిల్క్ పెరుగు బకెట్ ధర రూ.40 పెరిగింది.

మరోవైపు సంగం డెయిరీ కూడా ప్రస్తుతం ఉన్న ధరకు లీటరు ప్యాకెట్‌పై రూ.2, అర లీటరు ప్యాకెట్‌పై రూ.1 చొప్పున పెంచింది. పాల ప్యాకెట్లపై పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఎండీ గోపాల కృష్ణన్‌ తెలిపారు. పాల సేకరణ, ప్యాకింగ్‌ సామాగ్రి, ఇతర వ్యయాలు పెరిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొత్త ధరల విషయానికి వస్తే.. సంగం గోల్డ్‌ ప్లస్‌ అర లీటర్ ధర రూ.37 కాగా.. రూపాయి పెంచి రూ. 38కి పెరిగింది. హెచ్‌ఎఫ్‌సీఎం గోల్డ్‌ ప్యాకెట్‌ అర లీటరు ధర రూ.36 నుంచి రూ.37కుపెంచారు.. అదే లీటర్ ధ రూ.70 నుంచి 72కు పెంచారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...