ప్రజలకు బిగ్‌ అలర్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన ఇండియన్ ఆయిల్.. లీటర్ ఎంతంటే?

Date:

Indian Oil Hikes Premium Petrol And Diesel Prices: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పవర్ పెట్రోల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ కంపెనీల బాటలోనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా నడుస్తోంది. తాజాగా ఇండియన్ ఆయిల్ తమ ప్రీమియం ఇంధన ధరలను పెంచింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచములు ధరలు భారీగా పెరిగాయి.ఈ నేపథ్యంలో దేశీ ప్రభుత్వం రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. హై-ఎండ్ లగ్జరీ కార్లు, సూపర్ బైక్‌లలో ఉపయోగించే ఎక్స్‌పీ100 పెట్రోల్ ధరను లీటరుకు రూ.11 పెంచింది. దీంతో ఎక్స్‌పీ100 లీటర్ పెట్రోల్ ధర రూ.160కి చేర్చారు. ప్రీమియం డీజిల్ వేరియంట్ ‘ఎక్స్‌ట్రా గ్రీన్’ ధరను లీటరుకు రూ.91.49 నుంచి రూ.92.99కి పెంచింది.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుండి రూ.3కి, డీసెల్‌పై రూ.10 నుండి సున్నాకి తగ్గించింది. అయినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వినియోగదారులకు తక్షణ ఉపశమనం లభించే సూచనలు తక్కువగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా బుధవారం చమురు కంపెనీలు 19 కేజీల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.195.50 పెంచాయి. ఢిల్లీలో ఇప్పుడు ఒక కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.2,078.50కి చేరింది. దీనితో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలోలీటరుకు టెర్బైన్ ప్యూల్ ధర రూ.2.07 లక్షల రికార్డు స్థాయికి చేరడంతో, విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు పెరిగాయి. ఇక జెట్ ఫ్యూయల్ ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షలు దాటడం ఇదే మొదటిసారి. అయితే, దేశీయ విమానయాన సంస్థలు జెట్ ఇంధన ధరలలో కేవలం 8.5 శాతం పెంచినట్టు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...