స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇందులో భాగంగానే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, నగరిలో మాజీ ఎమ్మెల్యే రోజా అల్లర్లకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకే వైసీపీ 59 కేసులు వేసిందని ఆరోపించారు.

నంద్యాలలో కౌన్సిలర్‌ అభ్యర్థి నాగమణి సంతకాలు చేసి నామినేషన్‌ ఉపసంహరించుకుంటే ఆ ఘటనను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని బొండా ఉమా అన్నారు. 2014 మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కేవలం ఒక శాతం మాత్రమే ఉండగా, 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో దౌర్జన్యాలకు పాల్పడి 21 శాతం స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు.

వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన బొండా ఉమా సొంత బాబాయి హత్య కేసును ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీకి అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో వైసీపీ రాజకీయంగా కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 85 శాతం నెరవేర్చకుండా జగన్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందని బొండా ఉమా ఆరోపించారు. 2029 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని ఆయన పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *