
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న శాయన శేషు కుమారి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధి కోసం తొమ్మిది హామీలు ప్రకటించానని, విజయం సాధించిన అనంతరం వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌కు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబీదాకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.
ప్రచారంలో ఆమె భర్త శాయిన శివతో పాటు జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డివిజన్ అభివృద్ధికి తనకు మద్దతుగా నిలవాలని శేషు కుమారి ప్రజలను అభ్యర్థించారు.
