ఆర్నబ్‌ తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. తుఫాన్‌ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్రంతో పాటు ఆయా జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. సమస్యలను వేగంగా పరిష్కరించుకునేందుకు మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 9552300009ను వినియోగించుకోవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:

  • 112
  • 1070
  • 1800 425 0101
  • మనమిత్ర వాట్సాప్‌: 9552300009

ఆర్నబ్‌ తుఫాన్‌: ప్రభావిత జిల్లాల కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు

ఆర్నబ్‌ తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అవసరమైన సహాయం కోసం తమ జిల్లాకు సంబంధించిన కంట్రోల్‌ రూమ్‌ నంబర్లను సంప్రదించవచ్చు.

జిల్లా వారీగా ఫోన్‌ నంబర్ల వివరాలు

  1. శ్రీకాకుళం: 08942-240557
  2. విజయనగరం: 8922236947
  3. పార్వతీపురం మన్యం: 08963-450347
  4. అల్లూరి సీతారామరాజు: 8935293448
  5. విశాఖపట్నం: 0891-2590102, 0891-2590100
  6. అనకాపల్లి: 08924-222888, 08924-226599, 08924-225999
  7. కాకినాడ: 0884-2356801, 9849903879
  8. కోనసీమ: 8856293104
  9. తూర్పు గోదావరి: 8832944455
  10. పశ్చిమ గోదావరి: 08816-299181
  11. ఏలూరు: 18002331077, 9494041419
  12. పోలవరం: 18004254225
  13. తిరుపతి: 0877-2236007
  14. మార్కాపురం: 9248702500
  15. కృష్ణా: 08672-252399
  16. ఎన్టీఆర్‌: 9154970454
  17. గుంటూరు: 0863-2234014
  18. బాపట్ల: 08643-220226
  19. ప్రకాశం: 08592-295600, 18004250277
  20. నెల్లూరు: 7995576699

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *