D Educt: Oct 30: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే JNVST 2026 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్‌టికెట్లను నవోదయ విద్యాలయ సమితి (NVS) అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ప్రవేశ పరీక్ష నవంబర్‌ 28న జరగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే హాల్‌టికెట్‌ పొందాలని సూచించారు.

అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి విద్యార్థులు ముందుగా navodaya.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే “Click here to download Admit Card for Class VI JNVST” లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం విద్యార్థి రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని నమోదు చేసి, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. వివరాలను సరిచూసుకున్న తర్వాత Submit లేదా Sign In బటన్‌పై క్లిక్‌ చేస్తే హాల్‌టికెట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాలి.

హాల్‌టికెట్‌ పొందిన వెంటనే అందులో విద్యార్థి పేరు, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పరీక్ష కేంద్రం, పరీక్ష సమయం వంటి వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలి. పరీక్ష రోజున విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌ను వెంట తీసుకెళ్లాలి.

పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకుని, సమయానికి అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా అడ్మిట్‌ కార్డును ముందుగానే డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *