చైనా జిత్తులమారి వ్యూహం.. ట్రంప్ బీజింగ్ పర్యటనకు ముందు.. డ్రాగన్ కంట్రీలో తైవాన్ ప్రతిపక్ష నాయకురాలు

Date:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 14, 15 తేదీల్లో బీజింగ్ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ట్రంప్ బీజింగ్ టూర్‌కు ఐదు వారాల ముందే ఓ ప్రత్యేక అతిథి చైనాలో అడుగుపెట్టారు. దశాబ్ద కాలం తర్వాత తైవాన్ ప్రతిపక్ష నేత చైనాలో పర్యటిస్తున్నారు. కువోమింటాంగ్ (కేఎంటీ) ఛైర్‌పర్సన్‌గా గత ఏడాది బాధ్యతలు చేపట్టిన చెంగ్ లి-వున్.. షి జిన్‌పింగ్ ఆహ్వానంతో చైనాకు వెళ్లారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వస్తున్న వేళ.. జిన్‌పింగ్ తెలివిగా వ్యవహరించారు. సుమారు పదేళ్ల తర్వాత తైవాన్ ప్రతిపక్ష నాయకురాలికి ఆహ్వానం పంపారు. దీంతో కువోమింటాంగ్ (కేఎంటీ) చైర్‌పర్సన్ చెంగ్ లీ-వున్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లారు. షాంఘై, నాన్‌జింగ్, బీజింగ్ నగరాల్లో పర్యటించే చెంగ్.. చైనా అధ్యక్షుడిని సైతం కలిసే అవకాశం ఉంది.

చెంగ్ పర్యటన సమయంలో.. తైవాన్ ప్రతిపక్షంతో స్నేహపూర్వక సమావేశాన్ని నిర్వహించాలని బీజింగ్ కోరుకుంటోంది. తద్వారా అమెరికా-తైవాన్ రక్షణ సహకారానికి మద్దతుగా వినిపించే వాదనలను బలహీనపర్చాలని చైనా భావిస్తోందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ తైవాన్ సెంటర్లోని పొలిటికల్ సైంటిస్ట్ వెన్-టి సంగ్ తెలిపారు. ట్రంప్ బీజింగ్ పర్యటన సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై డ్రాగన్ ఫోకస్ పెట్టడానికి వీలు ఉంటుందని సంగ్ వివరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...