రోజూ పప్పు తింటే క్యాన్సర్‌, గుండె జబ్బుల రిస్క్‌ తగ్గుతుందట, షుగర్‌ ఉన్న వాళ్లూ తినొచ్చన్న డాక్టర్‌

Date:

నేటి ఆధునిక కాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్‌, షుగర్‌ వంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మరి ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు పప్పుధాన్యాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఫైబర్‌, ప్రోటీన్లు, ఖనిజాలతో కూడిన పప్పు దినుసులు కొలెస్ట్రాల్‌ను తొలగించడమే కాకుండా శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. మాంసాహారానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి. ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలున్న పప్పుధాన్యాలను రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ తగ్గనుంది.

ఆరోగ్యమే మహాభాగం అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనం తీసుకునే ఆహారమే మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాంటి ఆహార పదార్థాల్లో పప్పుధాన్యాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రకృతి మనకు అందించిన ఎన్నో అద్భుతమైన పోషక భాండాగారాల్లో పప్పుధాన్యాలు కూడా ఒకటి. ఈ పప్పుధాన్యాలు మనం రోజు తినే ఒక సాధారణ ఆహార పదార్థాలుగానే కాకుండా , క్యాన్సర్‌ (Cancer) వంటి దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకునే శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తాయని డాక్టర్‌ సంజయ్‌ భట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ – ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజీ, ఆస్టర్‌ సీఎంఐ హాస్పిటల్‌ చెబుతున్నారు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్టర్‌ సంజయ్‌ భట్‌ – సీనియర్‌ కన్సల్టెంట్‌ – ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజీ చెబుతున్న దాని ప్రకారం.. పప్పుధాన్యాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్‌ల ముప్పు తగ్గించుకోవచ్చు. పప్పుధాన్యాలు ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్‌ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా పప్పు ధాన్యాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...