ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

Date:

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి దిగి ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాడులు ఆపకపోతే ప్రపంచం ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూనే.. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక సంకేతాలు ఇచ్చారు. యురేనియం నిల్వల దగ్గర నుంచి ఉక్రెయిన్ సరిహద్దుల వరకు సాగిన ఈ 90 నిమిషాల చర్చలో.. ట్రంప్, పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య 90 నిమిషాల హాట్ టాక్ నడిచినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు దిగ్గజ నేతల మధ్య జరిగిన ఈ సుదీర్ఘ సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. ఇరాన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్రమత్తం చేశారు. టెహ్రాన్‌పై మళ్లీ సైనిక చర్యలకు దిగితే అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందా? అన్న ఆశలకు ఈ సంభాషణ ఊపిరి పోసింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణను పాటించే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు కూడా సానుకూలంగా స్పందించడంతో.. అతి త్వరలోనే ఒక శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...