జుట్టు రాలడం + చుండ్రు + చిట్లిపోవడం, అన్నీ సమస్యల నుంచి వేసవిలో మీ జుట్టును కాపాడే చిట్కాలు

Date:

వేసవి కాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఇక, వేసవిలో చర్మంతో పాటు జుట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. వేసవి కాలంలో సూర్యరశ్మి, కాలుష్యం, చెమట, మురికి జుట్టుపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అందుకే ఈ సీజన్‌లో సరైన కేశ సంరక్షణ చాలా అవసరం. ఈ సమస్యను ఎదుర్కోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే అనేక ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే, వీటిని ఎక్కువ కాలం వాడటం వల్ల జుట్టు, తల చర్మానికి హాని జరగవచ్చు. అందుకే సహజసిద్ధంగా జుట్టును సంరక్షించుకోవాలి.

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక అందం విషయంలో జుట్టు కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ నిగనిగలాడే ఒత్తైన జుట్టును కోరుకుంటారు. అయితే, వేసవిలో చర్మంతో పాటు జుట్టు కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండాకాలంలో దుమ్ము, ధూళి, చెమట, తీవ్రమైన సూర్య కాంతి, తేమ కారణంగా జుట్టు తరచుగా పొడిబారి, నిర్జీవంగా మారుతుంది.

ఈ సమస్యను ఎదుర్కోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే అనేక ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే, వీటిని ఎక్కువ కాలం వాడటం వల్ల జుట్టు, తల చర్మానికి హాని జరగవచ్చు. ఇక, వేసవిలో జుట్టుకు కలిగే నష్టాలు, వాటిని ఎదుర్కోవడానికి పాటించాల్సిన చిట్కాలు, జాగ్రత్తలు గురించి డాక్టర్ ఆర్జూ పహ్వా (డెర్మటాలజిస్ట్, కైలాష్ దీపక్ హాస్పిటల్) వివరాలు అందించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును కాపాడుకోవడంలో జుట్టు, తల చర్మం ఆరోగ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వేసవి నెలల్లో అధిక వేడి, తేమ, చెమట, ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, తల చర్మం పొడిబారి, జుట్టు రాలడం, చిక్కుపడటం, చుండ్రు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, కాలానుగుణ నష్టం నుంచి జుట్టును కాపాడటానికి మన రోజువారీ అలవాట్లు జుట్టు సంరక్షణ పద్ధతులు చాలా కీలకమవుతాయి.
– డాక్టర్ ఆర్జూ పహ్వా
.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...