ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు చేస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నెల నవంబర్ 13న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,219 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 26, 29 తేదీలతో పాటు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

దశల వారీగా ఎన్నికల నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. మొదటి విడతకు నవంబర్ 13న, రెండో విడతకు నవంబర్ 16న, మూడో విడతకు నవంబర్ 19న నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *