D Educt: Nov 9: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల.. నవంబర్ 11 నుంచి గడువు ప్రారంభం!

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 11 నుంచి 25వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది.

గడువు దాటిన తర్వాత అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రూ.50 అపరాధ రుసుముతో, డిసెంబర్ 3 నుంచి 9 వరకు రూ.200 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. ఇక డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు.

పరీక్ష ఫీజు విషయానికి వస్తే.. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు పరీక్షలు రాసే విద్యార్థులు రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. వృత్తివిద్య కోర్సులకు చెందిన అభ్యర్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. అలాగే నిర్ణీత వయోపరిమితి నిబంధనల నుంచి మినహాయింపు కోరే విద్యార్థులు వయోపరిమితి సడలింపు రుసుముగా రూ.300 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *