ఒక్కరోజులోనే రూ. 3300కు పైగా పడిపోయిన షేర్ ధర.. అసలేమైంది? చైనా ఎంట్రీతోనే ఇలా..

Date:

Power Sector Stocks Crash: భారత స్టాక్ మార్కెట్లలో శుక్రవారం (జులై 3) ఉత్సాహభరితమైన ట్రేడింగ్ కొనసాగుతోంది. ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ, పవర్ సెక్టార్‌కు చెందిన పలు కంపెనీల షేర్లు మాత్రం భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈ పతనానికి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా హితాచీ ఎనర్జీ ఇండియా షేరు ఇంట్రాడేలో 10 శాతం వరకు క్షీణించగా, ఇతర విద్యుత్ పరికరాల కంపెనీల షేర్లు కూడా భారీగా పడిపోయాయి.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ రంగ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేందుకు నాలుగు చైనా విద్యుత్ పరికరాల తయారీ సంస్థలకు రెండేళ్ల పాటు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 2020 గల్వాన్ ఘటన తర్వాత చైనా కంపెనీలపై అమల్లోకి వచ్చిన కఠిన నిబంధనల్లో ఇది కీలక సడలింపుగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశీయ కంపెనీలకు పోటీ పెరిగే అవకాశం ఉందనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది. భవిష్యత్తులో ఆదాయం, లాభదాయకతపై ప్రభావం పడవచ్చనే అంచనాలతో పవర్ సెక్టార్ షేర్లలో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి.

ఈ ప్రభావం ముఖ్యంగా జీఈ వెర్నోవా టీ&డీ, హితాచీ ఎనర్జీ ఇండియా, సీమెన్స్ ఎనర్జీ, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ వంటి కంపెనీల షేర్లపై స్పష్టంగా కనిపించింది. వీటిలో హితాచీ ఎనర్జీ ఇండియా అత్యధిక నష్టాన్ని చవిచూసింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.33,775 వద్ద ముగిసిన ఈ షేరు, శుక్రవారం స్వల్ప నష్టంతో ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడేలో ఏకంగా 10 శాతం వరకు పడిపోయి రూ.30,400 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అంటే ఒక్కరోజులోనే షేరు ధర దాదాపు రూ.3,375 మేర క్షీణించింది. వార్త రాస్తున్న సమయానికి ఈ స్టాక్ సుమారు 9.5 శాతం నష్టంతో రూ.30,590 వద్ద ట్రేడవుతోంది.

ప్రస్తుతం హితాచీ ఎనర్జీ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.3.11 లక్షల కోట్లుగా ఉంది. గత 52 వారాల్లో ఈ షేరు గరిష్ఠంగా రూ.38,785, కనిష్ఠంగా రూ.16,111 స్థాయిలను నమోదు చేసింది. గత నెల రోజుల్లో షేరు దాదాపు 15 శాతం క్షీణించినప్పటికీ, ఆరు నెలల కాలంలో 61 శాతానికి పైగా లాభపడింది. అలాగే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 66 శాతం రాబడిని అందించగా, గత ఐదేళ్లలో 1,500 శాతానికి పైగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది.

ఇక ఇతర పవర్ సెక్టార్ స్టాక్స్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. జీఈ వెర్నోవా టీ&డీ షేరు కూడా ఇంట్రాడేలో 10 శాతం వరకు పడిపోయి రూ.4,370 వద్ద ట్రేడైంది. ఒక్కో షేరుపై రూ.450కు పైగా విలువ ఆవిరైంది. సీమెన్స్ ఎనర్జీ షేరు 2 శాతం వరకు క్షీణించగా, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేరు 7 శాతం వరకు పడిపోయింది. దీంతో పవర్ సెక్టార్‌లోని ప్రధాన కంపెనీల షేర్లు ఒకేసారి నష్టాల్లోకి జారిపోవడంతో ఇన్వెస్టర్ల సంపదకు భారీ గండిపడింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....