బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంతో పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కూడా బంగారం ధరల్లో క్షీణత నమోదైంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్ల బంగారం ధరలు తగ్గాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,140గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే పది గ్రాములపై రూ.760 తగ్గింది.

ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,24,700గా ఉంది. గత రోజుతో పోలిస్తే పది గ్రాములపై రూ.700 తగ్గుదల నమోదైంది.

బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు మార్కెట్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే బంగారం కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ దుకాణాల్లో తాజా ధరలు, మేకింగ్ ఛార్జీలు, ఇతర పన్నుల వివరాలను తెలుసుకోవడం మంచిది.

ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
విజయవాడ₹1,36,040₹1,24,700₹1,02,030
విశాఖపట్నం₹1,36,040₹1,24,700₹1,02,030
అమరావతి₹1,36,040₹1,24,700₹1,02,030
కాకినాడ₹1,36,040₹1,24,700₹1,02,030
తిరుపతి₹1,36,040₹1,24,700₹1,02,030

తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
హైదరాబాద్₹1,36,040₹1,24,700₹1,02,030
వరంగల్₹1,36,040₹1,24,700₹1,02,030
నిజామాబాద్₹1,36,040₹1,24,700₹1,02,030
ఖమ్మం₹1,36,040₹1,24,700₹1,02,030

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
చెన్నై₹1,36,040₹1,24,700₹1,02,050
ముంబై₹1,36,040₹1,24,700₹1,02,030
ఢిల్లీ₹1,36,200₹1,24,850₹1,02,180
కోల్‌కతా₹1,36,040₹1,24,700₹1,02,030
కేరళం₹1,36,040₹1,24,700₹1,02,030
పుణె₹1,36,040₹1,24,700₹1,02,030

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *