D Spiritual: Nov 18: శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం భక్తుల దర్శనం కోసం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు తెరుచుకుంది. కొత్తగా నియమితులైన ఆలయ ప్రధాన పూజారి అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి గర్భగుడి తలుపులు తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పటికే శబరిమలకు చేరుకున్న వేలాది మంది భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం ప్రతిరోజూ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 60 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా మరో 14 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమలకు తరలివస్తుండటంతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా 461 బస్సులను కేటాయించింది. చెంగన్నూర్, కొట్టాయం, ఎర్నాకుళం ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *