విశాఖపట్నంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నారు. నగరంలో అవసరమైన చోట్ల ఆర్వోబీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. తాజాగా న్‌ఏడీ కూడలి-గాజువాక మధ్య కాకాని నగర్ దగ్గర ఆర్వోబీ నిర్మాణం చేపట్టారు. రూ. 12.50 కోట్లతో శరవేగంగా పనులు చేపట్టారు. ఎన్ఏడీ కూడలి నుంచి గాజువాక మధ్య ట్రాఫిక్​ సమస్యకు చెక్​పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఆర్వోబీ నిర్మాణానికి అడుగులుపడ్డాయ.

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతోంది.. గత రెండేళ్లలో దిగ్గజ ఐటీ కంపెనీలు సాగరతీర నగరంలో అడుగుపెట్టాయి. ఐటీ కంపెనీల రాకతో పాటుగా, నగరం విస్తరిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో వాహనాల రద్దీ పెరిగిపోయింది.. ఈ క్రమంలో నగరంలో అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు, ఆర్వోబీలతో ట్రాఫిక్ ఫ్రీ జర్నీకి లైన్ క్లియర్ చేస్తున్నారు. విశాఖపట్నం ఎన్‌ఏడీ కూడలి-గాజువాక మధ్య కాకాని నగర్ కూడలి దగ్గర రద్దీతో ట్రాఫిక్ పెరిగింది. అక్కడ ట్రాఫిక్ ఆగిపోతే వాహనాలు స్తంభించిపోతున్నాయి. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా కాకాని నగర్ కూడలికి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఆర్‌వోబీ నిర్మిస్తున్నారు.. సిగ్నల్‌ సమస్య లేకుండా వాహనదారులు రాకపోకలు సాగించొచ్చు.

విశాఖపట్నం పశ్చిమం ఎమ్మెల్యే గణబాబు ఎన్‌ఏడీ కూడలి-గాజువాక మధ్య కాకాని నగర్ దగ్గర ఆర్‌వోబీ అవసరం ఉందని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ సమస్యను గుర్తించిన వీఎంఆర్‌డీఏ ఈ ఆర్వోబీ నిర్మాణానికి సిద్ధమైంది. కాకాని నగర్ కూడలి ఇరుకుంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆర్‌వోబీ నిర్మించడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ప్రత్యేక అనుమతులు తీసుకుని ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారు. అక్కడ కూడలికి 90 మీటర్ల ముందు ఆర్‌వోబీ అందుబాటులోకి రానుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్ పూర్తయ్యే చోట ఈ ఆర్వోబీని నిర్మిస్తున్నారు.. వాహనదారుల కోసం రెండు వైపులా సర్వీసు రోడ్లు కూడా ఉంటాయి. ఈ ఆర్వోబీని డిసెంబరు నాటికి పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశారు.