షాపుల్లో దొరికే కొన్ని క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్‌ను దూరం పెట్టడం మంచిది, ఎందుకో వివరంగా చెప్పిన సీనియర్‌ డాక్టర్‌!

Date:

నేటి మోడ్రన్‌ యుగంలో అందరికీ అందం అంటే భలే క్రేజ్‌. ముఖ్యంగా యువతీ, యువకులు అందంగా కనిపించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. చర్మ సంరక్షణ కోసం మనం ప్రతిరోజూ ఎన్నో ఉత్పత్తులు ఉపయోగిస్తుంటాం. కొంతమంది ప్రస్తుత ట్రెండ్‌, ప్రకటనలు చూసి రకరకాల స్కిన్‌కేర్‌ ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే అవి వాళ్ల చర్మానికి మంచిదా కాదా అని ఆలోచించకుండా మార్కెట్‌లో దొరికే రకరకాల ఉత్పత్తులు వాడేస్తూ ఉంటారు. అయితే కొన్ని స్కిన్‌కేర్‌ ఉత్పత్తులు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో స్కిన్‌కేర్‌ మీద అందరికీ శ్రద్ధ ఎక్కువైంది. మనలో చాలామంది ప్రతిరోజూ క్లెన్సింగ్‌ ప్రోడక్స్‌ నుంచి మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్, మేకప్ ప్రోడక్ట్స్‌ ఇలా రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. కొంతమంది మార్కెట్లో లభించే ప్రతి ఉత్పత్తి చర్మానికి మేలు చేస్తుంది, సహజ పదార్థాలతో తయారైంది, డెర్మటాలజిస్ట్ టెస్టెడ్ వంటి ఎట్రాక్టివ్‌ టాగ్స్‌ చూసి అది మంచిదా కాదా అనే ఆలోచన కూడా లేకుండా దాన్ని కొనేస్తూ ఉంటారు.

చాలామంది స్నానం చేయడానికి లూఫాలను వాడుతుంటారు. ఇవి చర్మాన్ని మంచిగా శుభ్రం చేస్తాయని అనుకుంటారు. అయితే లూఫాలో బ్యాక్టీరియా, ఫంగస్‌ వృద్ధి చెందడానికి అనువైన చోటు అని చెప్పొచ్చు. ముఖ్యంగా తేమ అధికంగా ఉండే బాత్రూమ్‌లో ఈ సూక్ష్మక్రిములు త్వరగా పెరుగుతాయి. దీనికి తీవ్రమైన ఎక్స్‌ఫోలియేషన్ కూడా తోడైతే చర్మంపై సూక్ష్మ గాయాలు, చికాకు ఏర్పడుతుంది. చర్మం రక్షణ పొర దెబ్బతింటుంది. డెర్మటాలజిస్ట్‌‌లు దీన్ని వాడకపోవడమే మంచిదని అంటున్నారు. రోజు చర్మాన్ని ఎక్స్‌పోలియేట్ చేయడం మంచిది కాదని చెబుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...