
D Spiritual: Nov 21: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం
తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం స్వామివారు, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో డాక్టర్ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
