
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన హెచ్ఆర్ ఛాంబర్స్ ఔట్సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పార్వతి రూ.50 లక్షలను విరాళంగా అందజేశారు.
ఈ మేరకు శనివారం తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను ఆమె కలిశారు. విరాళానికి సంబంధించిన డీడీని ఈవోకు అందజేశారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అందించిన ఈ విరాళం పట్ల టీటీడీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
శనివారం శ్రీవారిని 84,014 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,116 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ.4.28 కోట్ల ఆదాయం లభించింది.
ఇక తిరుమలలో 4.08 లక్షల లడ్డూలను విక్రయించగా, 2.08 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.




