
D Spiritual: Nov 23: స్వయంభు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
పాయకరావుపేట గ్రామీణం: కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరంలోని ప్రసిద్ధ స్వయంభు రామలింగేశ్వర స్వామివారిని రాష్ట్ర హోంమంత్రి అనిత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి అభిషేకాలు చేశారు. భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ పండితులు హోంమంత్రి అనితకు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.




