పార్వతీపురం, పార్వతీపురం పురపాలక సంఘంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన బెలగాం కరుణ, వైస్‌ చైర్‌పర్సన్‌గా బీజేపీకి చెందిన వలిరెడ్డి పార్వతి ఎన్నికయ్యారు.

సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో ప్రిసైడింగ్‌ అధికారి కె. హేమలత అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో తొలుత మున్సిపల్‌ కమిషనర్‌ బి. రామగోపాల్‌ నూతన చైర్‌పర్సన్‌ బెలగాం కరుణతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 36 మంది వార్డు కౌన్సిలర్లతో ప్రమాణం చేయించారు.

తదుపరి వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. బీజేపీ తరఫున రెండో వార్డు సభ్యుడు గేదెల రామారావు వలిరెడ్డి పార్వతి పేరును ప్రతిపాదించగా, 34వ వార్డు సభ్యుడు పాలకొండ రాజశేఖర్‌ బలపరిచారు. ఈ పదవికి ఇతరుల నుంచి ఎలాంటి నామినేషన్లు, పోటీ లేకపోవడంతో వలిరెడ్డి పార్వతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. అనంతరం ఆమెకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొని నూతన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *