
కర్నూలు, గూడూరు నగర పంచాయతీ నూతన చైర్‌పర్సన్‌గా బీజేపీ నాయకురాలు దమాం సునీతాబాయి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆర్డీఓ సందీప్, నగర పంచాయతీ కమిషనర్ రమేష్‌బాబు సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు సురేష్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరై సునీతాబాయికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన చైర్‌పర్సన్ మాట్లాడుతూ గూడూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం, తాగునీటి సమస్యను పరిష్కరించడం, రహదారులను అభివృద్ధి చేయడం, డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.




