
అమెరికా ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు అమెరికా దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు జులై 18న ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22k Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి సడెన్ షాక్ తగిలింది. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. కిందటి రోజు ఒక దశలో భారీగా తగ్గినట్లే అనిపించినా మళ్లీ కనిష్ఠ స్థాయిల నుంచి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు కిందటి రోజు ఔన్సుకు ఒక దశలో 3950 డాలర్ల స్థాయికి కూడా పడిపోయినా మళ్లీ అక్కడి నుంచి పెరిగింది. ప్రస్తుతం అది 4020 డాలర్లకు ఎగబాకింది. ఇక సిల్వర్ రేటు కూడా ఒక దశలో 54 డాలర్ల స్థాయికి పతనమైనా అక్కడి నుంచి మళ్లీ పెరిగి 56 డాలర్ల స్థాయికి పెరిగింది. ఇక దీనికి అనుగుణంగానే దేశీయంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి భీకర దాడులు జరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ జులై 18న ఉదయం 10.30 గంటల సమయంలో రూ. 700 పెరిగి తులం ప్రస్తుతం రూ. 1,31,350 వద్దకు చేరింది. దీనికి ముందటి రోజు రూ. 700 పడిపోయింది. అంతకుముందు రోజు రూ. 250 తగ్గింది. దానికి ముందు కూడా 5 రోజుల వ్యవధిలో 3 రోజులు పసిడి ధర తగ్గింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పెరగడం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది.
మరోవైపు 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర ఇవాళ శనివారం ఉదయం 10 గంటల తర్వాత రూ. 760 పెరిగి 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,43,290 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా ఇది రూ. 760, రూ. 280 మేర తగ్గింది. బంగారం ధరలు పెరిగినా వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ. 2.35 లక్షల వద్ద ఉంది. ఇది ముందటి రోజు రూ. 5 వేల మేర తగ్గింది.

