కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ప్రత్యేక సందేశాలు పోస్ట్ చేశారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాస దీక్షలు, దీపారాధనలు, శివనామస్మరణతో భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకుంటున్న భక్తులందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. పౌర్ణమి వెన్నెల, దీపాల వెలుగులు ప్రతి ఇంటా శుభాలను నింపాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన రోజున కలిగే వెలుగులు కుటుంబాల్లో శాశ్వత ఆనందాన్ని తీసుకురావాలని కోరుకున్నారు.

మరోవైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన వెలిగించే దీపాలు ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి హృదయంలో భక్తిభావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబానికి శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తన సందేశంలో పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *