నర్సాపురం: నర్సాపురం మండలంలో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని బుధవారం పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేశారు. స్థానిక మున్సిపల్ ఆడిటోరియంలో ఎంపీడీవో నాసర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

నర్సాపురం మండలంలోని 28 గ్రామాల్లో మొత్తం 62,921 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో వేములదీవి ఈస్ట్, పెదమైనవానిలంక గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 26 గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 300 వార్డులకు గాను 115 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 185 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం మున్సిపల్ ఆడిటోరియంలో 13 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నాసర్ రెడ్డి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల నిర్వహణపై వారికి పలు సూచనలు చేశారు.

పంచాయతీ ఎన్నికలు-2026ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. ఎన్నికల విధుల కోసం 800 మంది సిబ్బందిని నియమించామని, అత్యవసర పరిస్థితుల కోసం మరికొంత మందిని రిజర్వులో ఉంచినట్లు వెల్లడించారు. గ్రామాల్లో పోలింగ్ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *