
అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 709 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,240 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది బుధవారం పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లోనూ పోలింగ్
మరోవైపు రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా గురువారం పోలింగ్ జరగనుంది. రాజమహేంద్రవరం, మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లలో నాలుగు మేయర్ పదవుల కోసం 36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 257 కార్పొరేటర్ స్థానాలకు 911 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 11.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్ పదవుల కోసం 134 మంది, 707 కౌన్సిలర్ స్థానాలకు 2,057 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 30న వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.




