పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

Date:

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒక దారుణమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 10 ఓవర్లు వేసిన గుర్నూర్.. ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో లార్డ్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో 1975 లో కర్సన్ ఘావ్రి ఇంగ్లాండ్‌పై 11 ఓవర్లలో 81 రన్స్ ఇచ్చిన రికార్డును గుర్నూర్ బ్రార్ దాటేశాడు.

భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఓ అవాంఛనీయ రికార్డు నమోదు చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ పేసర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి మైదానంలో పూర్తిగా తేలిపోయాడు. తన కోటా 10 ఓవర్లు వేసిన బ్రార్ కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోగా, ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్‌లతో పాటు జో రూట్ కూడా గుర్నూర్ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీల వర్షం కురిపించారు.

ఈ దారుణమైన బౌలింగ్ ప్రదర్శనతో గుర్నూర్ బ్రార్ వన్డే క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. టీమిండియా తరఫున ఒకే వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. 2015లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 10 ఓవర్లలో 106 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. 2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాపై వినయ్ కుమార్ 9 ఓవర్లలోనే 102 రన్స్ సమర్పించుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు 2026 లార్డ్స్ వన్డేలో 97 రన్స్ ఇచ్చిన గుర్నూర్ బ్రార్ వీరి సరసన చేరాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...