
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు క్రీడాకారులు భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి. దిలీప్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రతిష్ఠాత్మక వరల్డ్ జూనియర్స్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో రాష్ట్రం నుంచి ఇద్దరు క్రీడాకారులు భారత్కు ప్రాతినిధ్యం వహించనుండటంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఏ. రవినాయుడు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ డా. డి. నవీన్ కుమార్, అధ్యక్షుడు వి. శ్రీనుబాబు, కోశాధికారి బి. నీరజతోపాటు వివిధ జిల్లాల సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సభ్యులు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
