
దేశవ్యాప్తంగా నీట్ (NEET) పరీక్షపై వివాదాలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (TVK) మరోసారి కీలక డిమాండ్ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని పార్టీ, నీట్‌ను దేశవ్యాప్తంగా పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది.
వైద్య విద్యలో ప్రవేశాలపై రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారాలు ఇవ్వాలని టీవీకే స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా రంగాన్ని తిరిగి రాష్ట్ర జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది.
నీట్ రద్దు విషయంలో ప్రజలకు హామీలు ఇచ్చి అమలు చేయని పార్టీలను పరోక్షంగా టీవీకే విమర్శించింది. ఈ అంశంపై తాము రాజీపడే ప్రసక్తే లేదని, విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని పార్టీ పేర్కొంది.

