CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!

Date:

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలు 32వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు తమ డిమాండ్లను మరింత విస్తరించారు. జూలై 20న శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు.

పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యమం నాలుగు ప్రధాన డిమాండ్లతో కొనసాగుతోందన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ విడుదల, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం, జూలై 20 నిరసనకారులపై కేసులు నమోదు చేయకపోవడం తమ ప్రధాన డిమాండ్లని తెలిపారు.

ఉద్యమం ఉధృతం కావడంతో ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు పార్టీ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....