
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)’ చిత్రం నుంచి హీరోయిన్ శ్రీనిధి శెట్టి పోషిస్తున్న ‘స్వర్ణ’ పాత్ర గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మధ్యతరగతి ఇల్లాలిగా, చిట్టిబాబుకు అండగా నిలిచే భార్య పాత్రలో శ్రీనిధి శెట్టి సహజమైన నటనతో ఆకట్టుకుంది.
ఈ గ్లింప్స్‌లో వెంకటేష్, శ్రీనిధి మధ్య సరదా సంభాషణలు, దాంపత్య జీవితంలోని చిన్న చిన్న హాస్యభరిత సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు త్రివిక్రమ్ మార్క్ కామెడీ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన చిట్టిబాబు పాత్ర గ్లింప్స్‌కు మంచి స్పందన రాగా, ఇప్పుడు స్వర్ణ పాత్ర పరిచయంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో సంపూర్ణ, సర్వ పాత్రల గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘AK47’ చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

