KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!

Date:

బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతితో నమ్మకమైన ఉద్యమ సహచరుడిని, ఆప్తమిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉద్యమం నుంచి చివరి శ్వాస వరకు పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని, నర్సంపేట అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ది మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సైతం సంతాపం వ్యక్తం చేసి, పెద్ది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...