ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారికి ఇతర పథకాలు నిలిచిపోతాయా.. హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

Date:

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేస్తే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్యూర్ ప్రాంతాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుండగా.. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ కీలక స్పష్టత ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిచిపోతాయని జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ఒక వీడియోను విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమేనని ఆయన చెప్పారు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసినా.. ఇప్పటికే పొందుతున్న ఇతర సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పారు. పింఛన్లు, రేషన్, ఇతర ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...