నకిలీ నోట్లపై జర జాగ్రత్త: ఆర్‌బీఐ

Date:

నకిలీ నోట్ల చలామణిపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ). బ్యాంకులను కోరింది. అంతర్జాతీయ సరిహద్దులకు చేరువలోని జిల్లాల్లో ఉన్న బ్యాంకు శాఖలు నకిలీ నోట్లను గుర్తించేందుకు తప్పనిసరిగా నోట్ల ధ్రువీకరణ, సార్టింగ్‌ మెషిన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

ఖాతాదారులు సమర్పించే కరెన్సీ నోట్లు అసలువా లేక నకిలీవా అనే విషయాన్ని తప్పనిసరిగా ఈ మెషిన్ల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఖాతాదారుడు ఇచ్చిన నోటు నకిలీదని తేలితే ఆ నోటును ఖాతాదారుడికి తిరిగి ఇవ్వడం లేదా స్వాధీనం చేసుకోవడం చేయాలని స్పష్టం చేసింది.

నకిలీ నోట్ల విషయంలో కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యంగా ఉన్నట్టు వార్తలు రావడంతో ఆర్‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు నగదు లావాదేవీలు జరిపే సిబ్బంది అందరికీ ఈ ఏడాది అక్టోబరులోగా అసలు నోట్లు, నకిలీ నోట్లను గుర్తించే నైపుణ్యాలపై పూర్తి శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. నకిలీ నోట్ల గుర్తింపు, రిపోర్టింగ్‌, పర్యవేక్షణకు సంబంధించి కూడా బ్యాంకులు సమగ్ర విధానం అనుసరించాలని కోరింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

శ్రీశైలానికి వరద ప్రవాహం.. ఆలమట్టి, జూరాల డ్యామ్‌లన్నీ ఆల్‌మోస్ట్ ఫుల్లు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ...

ఏపీలో మహిళలకు అద్భుత అవకాశం.. ‘చాయ్‌రాస్తా’లతో ప్రతి నెలా రూ.40వేల వరకు ఆదాయం, దరఖాస్తు చేస్కోండి

మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారు సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్...

5 రోజుల్లో 4 రాష్ట్రాలు.. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు సాధిక్ అరెస్ట్

రాజమండ్రి రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నుంచి గోదావరిలో దూకి పిఠాపురం...

గవర్నమెంట్ హాస్టల్స్‌లో సకల సౌకర్యాలు.. స్టూడెంట్స్‌ హాయిగా చదువుకోవచ్చు!

ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు...