
టీడీపీలో మరో రెండు కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె.. కడప ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్, అనంతపురం టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడు వివాాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రెండు కుటుంబాలు మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను కలిసి వివాహ ఆహ్వానపత్రికను అందజేశాయి. ఈ నెల 30న వివాహ వేడుక జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ కుటుంబాలు, ప్రజా ప్రతినిధుల మధ్య వియ్యంతో బంధుత్వాలు కలుస్తున్నాయి. కొంతమంది ప్రేమ వివాహాలతో, మరికొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరో రెండు రాజకీయ కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం .. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజులు వియ్యంకులు కాబోతున్నారు. రెండు కుటుంబాలు వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్‌ను ఆహ్వానించాయి.
విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు .. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబాలు కలిశాయి. ఆగస్టు 30న గుమ్మనూరు జయరాం కుమార్తె, పూల నాగరాజు కుమారుడు వివాహం జరగనుంది. వివాహ వేడుకకు ఆహ్వాన పత్రికను మంత్రి నారా లోకేష్‌కు అందేజేశారు. మంత్రి లోకేష్ కాబోయే వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. పూల నాగరాజు, గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం కుటుంబాలు మరికొందరు నేతల్ని కలిసి వివాహానికి ఆహ్వానించాయి.
గుమ్మనూరు జయరాం 2009లో ప్రజారాజ్యం తరఫున కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి.. 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.. ఆయన వైఎస్ జగన్ కేబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు మారడంతో గుమ్మనూరు జయరాం వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన టీడీపీలో చేరారు. ఆయన సొంత నియోజకవర్గం ఆలూరును వదిలి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్టకు చెందిన పూలనాగరాజు మొదటి నుంచి టీడీపీలో ఉన్నారు. 1984లో టీడీపీలో చేరారు.. 1987-88 మధ్య రాయదుర్గం తాలూకా యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 1989-94 వరకు అడహక్ కమిటీ సభ్యుడిగా.. 1994లో గుమ్మఘట్ట జడ్పీటీసీగా టీడీపీ నుంచి గెలిచారు. అనంతరం కొంతకాలం జిల్లా కమిటీ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014లో మళ్లీ టీడీపీ నుంచి గుమ్మఘట్ట జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఆయనకు 2017లో అనంతపురం జెడ్పీ ఛైర్మన్‌గా అవకాశం దక్కింది. పూల నాగరాజు 2024 ఎన్నికల్లో రాయదుర్గం టికెట్ ఆశించగా అవకాశం రాలేదు.. కూటమి ప్రభుత్వం ఆయనకు ఆర్టీసీ కడప రీజినల్ ఛైర్మన్‌గా నియమించింది. అంతేకాదు పూలనాగరాజును అధిష్టానం ఆయన్ను అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించింది. టీడీపీలో ఉన్న ఇద్దరు నేతలు వియ్యంకులు కాబోతున్నారు.

