Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్

Date:

లేటెస్ట్‌గా విడుదలైన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మరోసారి భారతీయ మార్కెట్ ప్రాధాన్యతను హాలీవుడ్‌కు చాటిచెప్పింది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 927 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి, రెండో అతిపెద్ద గ్లోబల్ ఓపెనింగ్ వీకెండ్ చిత్రంగా నిలిచింది. భారతదేశంలో కూడా ఈ మూవీ అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది. తొలి రోజు రూ.72.44 కోట్ల గ్రాస్, రూ.60.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించి హాలీవుడ్ చిత్రాల ఓపెనింగ్ రికార్డులను తిరగరాసింది. ఇక మొదటి నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్, రూ.257 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి ఇండియా మార్కెట్ హాలీవుడ్‌కు ఎంత కీలకంగా మారిందో మరోసారి నిరూపించింది.

ఇదే ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ముగ్గురు స్పైడర్-మెన్లను ఒకే తెరపై చూపించిన ఈ చిత్రం 1.921 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, సోనీ పిక్చర్స్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. భారతదేశంలో కూడా ఈ మూవీ రూ.218 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి హాలీవుడ్ చిత్రాలకు కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.

అంతకుముందు 2019లో విడుదలైన ‘స్పైడర్-మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్’ కూడా విశేష విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1.133 బిలియన్ డాలర్ల వసూళ్లతో బిలియన్ డాలర్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది. భారతదేశంలో రూ.105 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, దేశంలో రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి స్పైడర్-మ్యాన్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

2017లో వచ్చిన ‘స్పైడర్-మ్యాన్: హోమ్‌కమింగ్’ ఈ ఫ్రాంచైజీకి భారతీయ మార్కెట్‌లో బలమైన పునాది వేసింది. ప్రపంచవ్యాప్తంగా 880.9 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో రూ.75 కోట్లకు పైగా గ్రాస్, సుమారు రూ.58 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది.

హోమ్‌కమింగ్‌తో ప్రారంభమైన స్పైడర్-మ్యాన్ ప్రయాణం, ఫార్ ఫ్రమ్ హోమ్‌తో రూ.100 కోట్ల మార్క్‌ను, నో వే హోమ్‌తో రూ.200 కోట్ల మైలురాయిని దాటగా, ఇప్పుడు బ్రాండ్ న్యూ డే రూ.300 కోట్లను అధిగమించి రూ.400 కోట్ల దిశగా దూసుకెళ్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్పైడర్-మ్యాన్ సిరీస్ కేవలం సూపర్ హీరో ఫ్రాంచైజీ మాత్రమే కాదు.. భారతీయ మార్కెట్‌ను హాలీవుడ్ ఎంత ప్రాధాన్యంగా చూస్తోందో చెప్పే మరో స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...