వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్.. నెల్లూరు సబ్ జైలుకు తరలింపు

Date:

పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పొగాకు వ్యాపారి కొడుకును కిడ్నాప్ చేసిన కేసులో ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్ట్ చేశారు. న్యాయ స్థానం ముందు వారిని హాజరపరచగా 14 రోజుల రిమాండ్ విధించి, నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో ముస్తఫా కొడుకుకు కూడా కోర్టు రిమాండ్ విధించింది.

గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ముస్తాఫాకు నూజివీడు న్యాయ స్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు పోలీసులు ఆయన్ను హాజరుపరచగా రిమాండ్ విధించారు. దాంతో నెల్లూరు సబ్ జైలుకు ముస్తఫాను తరలించారు. ఇదే కేసులో ముస్తఫా కుమారుడు బషీర్‌కు కూడా కోర్టు రిమాండ్ విధించింది.

పొగాకు వ్యాపారి కొడుకు కిడ్నాప్ కేసు వ్యవహారం ఇటీవల కాలంలో తీవ్ర దుమారం రేపింది. పొగాకు వ్యాపారం లావాదేవీల విషయంలో వివాదం మొదలై అది కాస్తా కిడ్నాప్ వరకూ దారి తీసింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన వ్యక్తి ఆ ప్రాంతంలో పొగాకు సేకరించి విక్రయిస్తుంటాడు. ముస్తఫాకు గుంటూరులో ఒక పొగాకు గోదాము ఉండటంతో కొంతకాలంగా ఆయనకే పొగాకును విక్రయిస్తున్నాడు.

అయితే, ఈ మధ్య కొయ్యలగూడేనికి చెందిన వ్యక్తి ముస్తఫాకు కాకుండా మరో కంపెనీకి పొగాకు విక్రయిస్తున్నాడు. ధరల విషయంలో వ్యత్యాసం ఉండటంతోనే విక్రయించాల్సి వచ్చిందని ఆ వ్యక్తి కూడా చెప్పాడు. దాంతో పొగాకు వ్యాపారి కుమారుడు ఒక వాహనంలో పొగాకు బేళ్లను లోడ్ చేసుకుని కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు బయల్దేరారు.

ఈ క్రమంలో ముస్తఫా కొడుకు పొగాకు లోడ్‌తో వస్తున్న వాహనాన్నిఅడ్డగించి, తన కొడుకును కిడ్నాప్ చేశారంటూ పొగాకు వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై ముస్తఫాకు ఫోన్ చేసి అడిగితే, తనకు రావాల్సిన డబ్బులు ఇచ్చి కొడుకును విడిపించుకోవాలని చెప్పినట్టు బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...