క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే లేపాక్షి కళాఖండాల వివరాలు.. పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచన

Date:

క్యూ ఆర్ కోడ్ వచ్చిన తర్వాత ప్రతి ప్రొడక్ట్‌కు సంబంధించిన వివరాలు అందులోనే ఉంటాయి. దాంతో మన హస్తకళలను ప్రోత్సహించేందుకు.. కళాకారులకు గుర్తింపు తీసుకొచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో తొలిసారి హస్తకళా ఉత్పత్తులకు క్యూ ఆర్ కోడ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ కళాఖండాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో నిజమైన కళాకారులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

హస్తకళలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది. కనుమరుగవుతున్న ఆ హస్తకళలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. హస్తకళా వస్తువులను కొనుగోలు చేసేలా అందులో సాంకేతికతను జోడించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు క్యూ ఆర్ కోడ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.

లేపాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ వ్యవస్థను అధికారులు ప్రారంభించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ కళాఖండాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందుబాటులో ఉంటాయి. కళాఖండం చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, దానిని రూపొందించిన కళాకారుడి పేరు, నైపుణ్యం, తయారీ విధానం అన్నీ క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తమై ఉంటాయి.

మొదటి దశలో రాష్ట్రంలోని ఎనిమిది హస్తకళా ఉత్పత్తులకు ఈ క్యూ ఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. బొబ్బిలి వీణ, కలంకారి పెయింటింగ్స్, సవర ఆదివాసి పెయింటింగ్స్ వంటి ప్రముఖ హస్తకళా ఉత్పత్తులకు డిజిటల్ ప్రొఫైల్ రూపొందించారు. ముడిసరుకు, తయారీ సమయం, వస్తువు కొలతలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. జీఐ ట్యాగ్, ఒక జిల్లా – ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలు క్యూ ఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

ఈ క్యూ ఆర్ కోడ్ విధానం ద్వారా నిజమైన కళాకారులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. క్యూ ఆర్ కోడ్ విధానం అమల్లోకి వస్తే నకిలీ హస్తకళా ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే అన్ని హస్తకళా ఉత్పత్తులకు క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...