సీఎం చంద్రబాబుకు చేనేత చిరు కానుక.. బుజ్జి మగ్గం భలే ఉందిగా!

Date:

అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జాండ్రపేటలో పర్యటించనున్నారు. అక్కడే ప్రజా వేదిక నిర్వహించి, చేనేతలతో ముఖాముఖి కానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓ చిన్న మగ్గాన్ని నేత కార్మికుడు ఆయనకు బహూకరించనున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కోసమే ఈ మగ్గాన్ని తయారు చేసినట్లు కార్మికుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కోసం కూడా మరో కానుక ఉన్నట్లు ఆయన తెలిపారు.

అగ్గిపెట్టెలో పట్టే చీర నేసే చేనేత బుజ్జి బుజ్జి మగ్గాలు కూడా తయారు చేయగలడని ఈ నేతన్న నిరూపించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్ల జిల్లా పర్యటన సందర్భంగా చీరాలలోని ఈఫురుపాలెం చేనేత కళాకారుడు ఆయనకు ప్రత్యేకంగా ఓ కానుక ఇవ్వనున్నాడు. అతి చిన్న మగ్గాన్ని తయారు చేయడమే కాకుండా దానిపై జాతీయ జెండాను నేస్తున్నట్లు చేశాడు. తన అభిమాన నేత చంద్రబాబు నాయుడుకు ఈ కానుకను అందజేయనున్నాడు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తపేట పర్యటన నేపథ్యంలో ఈఫురుపాలేనికి చెందిన చేనేత కళాకారుడు మునగపాటి నాగరాజు ఒఖ ప్రత్యేక కానుక సిద్ధం చేశారు. రెండు దశాబ్దాలుగా చేనేత మగ్గాల తయారీలో నాగరాజుకు మంచి పేరు ఉంది. చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య‌కు తన కళా వైభవాన్ని చూయించడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. దాంతో కొన్ని రోజుల వ్యవధిలోనే జాతీయ జెండా వస్త్రాన్ని నేస్తున్నట్లు ఓ చిన్న మగ్గాన్ని తయారు చేశారు. సభా వేదికపై ముఖ్యమంత్రికి ఈ కానుక అందజేయనున్నాడు. ప్రధాని మోదీ కోసం మరో కానుక సిద్ధం చేస్తున్నట్ల తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో సీఎం చంద్రబాబు జూలై 7న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏడాదికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 71,536 మంది నేత కార్మికుల కుటుంబాల ఖాతాల్లో రూ. 179 కోట్లు జమచేయనుంది.

ఈ పర్యటనలో భాగంగా అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు చీరాల పర్యటనకు బయల్దేరనున్నారు. 11:05 గంటలకు ప్రజావేదికకు చేరుకుని అక్కడ ప్రసంగిస్తారు. జాండ్రపేటలో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన చేనేత వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. చేనేతల కోసం ఇప్పటికే నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్‌లో చేనేతలకు మరింత భరోసా కల్పిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...