ఎల్‌ఐసీ లాభం రూ.13,492 కోట్లు

Date:

న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) 23 శాతం వృద్ధితో రూ.13,492 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.10,987 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

సమీక్షా త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం రూ.2,22,864 కోట్ల నుంచి రూ.2,37,848 కోట్లకు పెరిగింది. కొత్త వ్యాపారంలో పెరుగుదల సంస్థ లాభాల్లో వృద్ధికి దోహదపడింది. మొత్తం ప్రీమియం ఆదాయం జూన్‌ త్రైమాసికంలో రూ.1,27,250 కోట్లుగా ఉందని, క్రితం ఆర్థిక సంవత్సరం.

ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,19,200 కోట్లతో పోల్చితే 6.75 శాతం వృద్ధి నమోదైందని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. కాగా జూన్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీ తొలి సంవత్సర ప్రీమియం ఆదాయం రూ.9,217 కోట్లకు పెరిగింది. రెన్యూవల్‌ ప్రీమియం ఆదాయం రూ.61,833 కోట్లకు చేరుకుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

యశ్‌పై దిల్ రాజు నమ్మకం.. ‘టాక్సిక్’కు రూ.120 కోట్ల బిగ్ డీల్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక...

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో జెన్-జీ సమావేశం.. యువత ప్రశ్నలకు ఆలోచింపజేసేలా ‘కూల్ గురు’ సమాధానాలు..!

భయం వెంటాడుతున్నప్పటికీ స్థిరమైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? విజయం కోసం జరిగే...

ధోనీ రికార్డు బద్దలు.. విదేశీ టెస్టుల్లో పంత్ సరికొత్త చరిత్ర!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన...