ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆమ్రపాలికి ఆదేశం.

Date:

ఏపీ ప్రభుత్వం శుక్రవారం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను కలిపి 22 మందిని బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా శ్యామలరావును నియమించారు. కోన శశిధర్‌ను రవాణాశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆమ్రపాలి కాటాను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం భారీస్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 22 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్‌గా శ్యామలరావును నియమించారు. రవాణాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌ను బదిలీ చేశారు. టూరిజం ఎండీగా రవి సుభాష్‌ను నియమించిన ప్రభుత్వం.. ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆర్టీసీ జాయింట్ ఎండీగా శివప్రసాద్‌ను నియమించారు. పురావస్తుశాఖ కమిషనర్‌గా ముత్యాలరాజును నియమించారు. వీఎంఆర్డీఏ కమిషనర్‌గా ప్రఖర్ జైన్, టీటీడీ జేఈవోగా ప్రభల గోపీనాథ్‌ను నియమించారు.

జీఏడీ, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (సర్వీసెస్ అండ్ హెచ్ఆర్ఎం)గా ఉన్న షంషేర్ సింగ్ రావత్‌ను.. టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శివప్రసాద్‌ను నియమించారు. ఏపీటీడీసీ ఎండీగా ఉన్న ఆమ్రపాలి కాటాను ఆ పదవి నుంచి బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం.. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. సురేష్ కుమార్‌ను గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారిగా నియమించారు. నారాయణ భరత్ గుప్తాను గోదావరి పుష్కరాల జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు.

కేవీఎన్ చక్రధర బాబును హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌గా, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా బదిలీ చేశారు. హెప్సిబా రాణిని హౌసింగ్ డిపార్టుమెంట్ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. పి. అరుణ్ బాబును డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. గీతాంజలి శర్మను ఆర్టీజీఎస్ సీఈవోగా నియమించారు. ఎ. శరత్‌ను టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గుడిపాల నుంచి తమిళనాడుకు జోరుగా ఇసుక అక్రమ రవాణా?

చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా...

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...