సంగం మండలం దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ!

Date:

నెల్లూరు జిల్లా, సంగం మండలం: జంగాల కండ్రిక గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర మానవతా దృక్పథంతో స్పందించి ఓ దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందజేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానికుల సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు.

ఈ క్రమంలో కుటుంబానికి దూరమై, సహాయం చేసేవారు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జయమంగళం మహేష్ పరిస్థితిని గుర్తించిన విజయ్ చంద్ర వెంటనే స్పందించారు. ముత్యాల ప్రమీల మల్లికార్జున చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేష్‌కు ట్రై సైకిల్‌ను అందజేశారు.

అంతేకాకుండా దివ్యాంగ పింఛన్ పొందేందుకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ లేకపోవడంతో, సమస్య పరిష్కారానికి విజయ్ చంద్ర స్వయంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మహేష్‌కు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో పలువురు నిరుపేద మహిళలను గుర్తించి వారికి చీరలను పంపిణీ చేశారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ముత్యాల విజయ్ చంద్రను గ్రామస్థులు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన సేవలను స్థానికులు ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గుడిపాల నుంచి తమిళనాడుకు జోరుగా ఇసుక అక్రమ రవాణా?

చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా...

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...