అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్, డిసెంబర్ నెలలో పరీక్షలు.. విద్యాశాఖ ప్రకటన

Date:

ఏపీలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని ఏపీ విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా తెలిపారు. డీఎస్సీ 2025పై వస్తున్న ఆరోపణలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు శుక్రవారం మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులు ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పింది. వచ్చే అక్టోబర్ నెలలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా తెలిపారు. డిసెంబర్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మెగా డీఎస్సీపై వస్తున్న ఆరోపణల మీద ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం మరోసారి వివరణ ఇచ్చింది. అమరావతి సచివాలయంలో విలేకర్లతో మాట్లాడిన తమీమ్ అన్సారియా.. డీఎస్సీ 2025పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. డీఎస్సీ 2025 ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేశామని.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించామన్నారు. అయినప్పటికీ డీఎస్సీ 2025పై నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని.. ఆందోళనకు గురికావద్దని సూచించారు.

మరోవైపు 2025 డీఎస్సీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకూ మూడుసార్లు వివరణ ఇచ్చామని.. అయినా కూడా దుష్ప్రచారం చేస్తుంటే మరోసారి క్లారిటీ ఇస్తున్నట్లు వివరించారు. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ప్రకారమే అర్హులకే పోస్టులు దక్కాయన్న తమీమ్ అన్సారియా.. ఏవైనా అనుమానాలు ఉంటే తమ వద్దకు రావాలని సూచించారు. 12 పద్ధతులను అనుసరించి డీఎస్సీ నిర్వహించామని.. డీఎస్సీ మెరిట్, సెలక్షన్ లిస్టును ఆన్ లైన్‌లో ఎప్పుడైనా చూసుకునే అవకాశం ఉందన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆందోళనకు గురికావొద్దని.. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తమీమ్ అన్సారియా తెలిపారు. ఉద్యోగాలు రాని అభ్యర్థులు.. ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మకుండా వచ్చే డీఎస్సీపై దృష్టిపెట్టాలని తమీమ్ అన్సారియా సూచించారు

మరోవైపు స్పోర్ట్స్ కోటా టీచర్ల నియామకాలపై ఏపీ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ భరణి స్పందించారు. అన్ని ఫెడరేషన్లు, స్పోర్ట్స్ అసోసియేషన్లు నుంచి పూర్తి వివరాలు సేకరించామని, ప్రతి అభ్యర్థి ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించామని వివరించారు. ఆ తర్వాతే ప్రిలిమినరీ ప్రాధాన్యత జాబితాను రూపొందించి విద్యాశాఖకు పంపినట్లు భరణి క్లారిటీ ఇచ్చారు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...