2026 వినాయక చవితి ఎప్పుడు? బొజ్జ గణపయ్య పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం ఇవే!

Date:

హిందువులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి యేడు ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. మరి, ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోనున్నారో ఇక్కడ చూద్దాం.

హిందువులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి యేడు ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. మరి, ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోనున్నారో ఇక్కడ చూద్దాం..

ఈ గణేశ్‌ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు. ఈ భాద్రపదమాసం వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ మాసంలో గణపతిని పూజిస్తూ ఉంటారు. ఈ పండుగను అత్యంత శుభప్రదంగా కూడా హిందువులు భావిస్తారు. 2026 లో వినాయక చవితి పండుగను వచ్చే నెల సెప్టెంబర్‌ 14వ తేదీ సోమవారం రోజున ఘనంగా భక్తులు జరుపుకోనున్నారు.

అయితే, సెప్టెంబర్‌ 14 నుంచి వినాయక విగ్రహాలను పెట్టి 11 రోజులు పూజలు చేస్తారు. అయితే, ఈ ఏడాది పండుగ సోమవారం రావడంతో వరుసగా మూడు రోజులు అంటే శని, ఆది, సోమవారం ఇలా మూడు రోజులు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 14, 2026 న పూజ ముహూర్తం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 1:31 వరకు పూజ చేసుకోవచ్చు.

ఆ రోజు కానీ, ముందు రోజు కానీ ఇంటిని శుభ్రం చేసి, గణేశుడి కోసం పూజ గదిని మండపంలా అలకంరించాలి. శుభ ముహూర్తంలో బొజ్జ గణపయ్య మట్టి విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకురండి. ప్రసాదం కోసం మోదకాలు, కుడుములు , ఉండ్రాళ్లు వంటి వాటిని ప్రసాదంలా పెట్టండి. పూజ చేసిన రోజులు రోజూ ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వండి

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...