
డీఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న రాజకీయ ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఆయన మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.
ఐదేళ్ల పాలనలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వైసీపీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం, అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గంజాయి ముఠాలు, బ్లేడ్ బ్యాచ్‌ల విషయంలోనూ వైసీపీ వైఖరిని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు. రాజకీయ ముసుగులో జరుగుతున్న అరాచకాలను ఉపేక్షించాలా? అని ప్రశ్నించారు.

