
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన సీఎం. 24 ఏళ్ల చిన్న వయసులో అఫిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న అఫిఫా అకాల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అఫిఫా కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. షరీన్ బేగం, ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

